

సినిమా ఇండస్ట్రీలో వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని కొందరు అగ్ర నటులు నిరూపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా కెమెరా ముందుకు రావాలనే ఆసక్తి, కొత్త కథల్లో నటించాలనే ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ 84 ఏళ్ల వయసుతో ముందున్నారు. అనంత్ నాగ్ 78, మమ్ముట్టి 75, రజనీకాంత్ 75, చిరంజీవి 71, కమల్ హాసన్ 71 ఏళ్ల వయసులోనూ సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. అలాగే నాగార్జున 67, మోహన్‌లాల్ 66, వెంకటేష్ 65, శివరాజ్‌కుమార్ 64 ఏళ్ల వయసులో తమ నటనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వీరంతా తమ అనుభవంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
మరోవైపు యువతరానికి పోటీగా నిలుస్తున్న సీనియర్ నటుల జాబితాలో ఆమిర్ ఖాన్ 61, షారుక్ ఖాన్ 60, సల్మాన్ ఖాన్ 60, అక్షయ్ కుమార్ 59, అజయ్ దేవగన్ 57 ఏళ్ల వయసులో కొనసాగుతున్నారు. విభిన్న భాషలు, విభిన్న తరాలకు చెందినప్పటికీ వీరందరిలో కనిపించే కామన్ పాయింట్ మాత్రం సినిమాపై ఉన్న ప్రేమే. ఒకప్పుడు స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వీరు ఇప్పటికీ కొత్త కథలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న తీరు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే నటీనటులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. అందుకే ప్రతిభకు, పట్టుదలకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!