
జనరల్

‘మా ఊరి పొలిమేర’ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అగధ’. సీనియర్ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆత్మలు, చేతబడులు, మార్మిక శక్తుల నేపథ్యంలో రూపొందింది. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి కీలక పాత్రల్లో నటించగా, రాకేష్ వెంకటాపురం నేపథ్య సంగీతాన్ని అందించారు.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో కామాక్షి భయానక లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు చూడని కొత్త తరహా హారర్ అనుభూతిని అందిస్తామని చిత్రబృందం చెబుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!