
జనరల్

గతేడాది వరుస సీక్వెల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అజయ్ దేవగణ్ ఈసారి కూడా అదే జోష్‌లో ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాల్ 4’కు ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులై 17న విడుదల అవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీని ముందుకు మార్చినట్లు తెలుస్తోంది.
పలు కారణాల నేపథ్యంలో చిత్రాన్ని జులై 10న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫేరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్ నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!