
సినిమాలు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ విజయ్ లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఓ బాధితుడి నుంచి మొత్తం రూ.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసిన ఎస్‌ఐ, అందులో భాగంగా లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన అనంతరం ఎస్‌ఐ విజయ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. లంచం డిమాండ్‌కు సంబంధించిన వివరాలు, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!