
జనరల్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. కేసు విచారణలో భాగంగా నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరై విచారణకు సహకరించనున్నారు. ఈ కేసు విచారణపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!