

‘ధురంధర్: ది రివెంజ్’తో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ తన తదుపరి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ప్రళయ్’ను పట్టాలెక్కించారు. పోస్ట్-అపోకలిప్టిక్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం ముంబైలో ప్రారంభమైంది. ముంబై పరిసర ప్రాంతాల్లోని లైవ్ లొకేషన్లలో చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. కథ, భారీ స్థాయి నిర్మాణంతో ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
‘స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ’, ‘లూటేరే’ వంటి ప్రశంసలు పొందిన సిరీస్‌లకు దర్శకత్వం వహించిన జై మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు హన్సల్ మెహతా కుమారుడైన జై ఈ కథపై కొంతకాలంగా పనిచేస్తున్నట్లు సమాచారం. మలయాళ నటి కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
కుప్పకూలుతున్న ప్రపంచంలో మనుగడ, ధైర్యం, విలువైన వాటి కోసం జరిగే పోరాటం చుట్టూ కథ సాగనుంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. బిర్లా స్టూడియోస్, ట్రూ స్టోరీ ఫిలింస్, రణ్‌వీర్ సింగ్‌కు చెందిన మా కసమ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జై మెహతా, విశాల్ కపూర్ కలిసి కథను రచించారు. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!