

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ అడ్వెంచర్ డ్రామా 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్‌బాబు మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయనున్నారనే వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ విజయం సాధించడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యం లభించింది.
అయితే ఈ వార్తలపై అనిల్ రావిపూడి తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. మహేష్‌బాబు అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. అయితే తమ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అభిమానులు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. దీంతో మహేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై వస్తున్న తాజా పుకార్లకు ప్రస్తుతానికి తెరపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!