

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ రావడం ఖాయమని సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. ‘రోమాంచకం’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ‘స్పిరిట్’ సెన్సార్ గురించి ప్రశ్నించగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో సినిమా కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు.. ‘స్పిరిట్’లోనూ కథను ఎలాంటి పరిమితులు లేకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ఈ సినిమాలో శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో పాటు తీవ్ర భావోద్వేగాలకు కూడా సినిమాలో ప్రాధాన్యం ఉంటుందని దర్శకుడి వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమాను 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెన్సార్ విషయంలో దర్శకుడు ఇచ్చిన తాజా క్లారిటీతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్‌ను ఇంతకుముందెన్నడూ చూడని తరహాలో సందీప్ రెడ్డి వంగా చూపించనున్నాడనే ప్రచారం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (1)
❤️