

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలయికలో తెరకెక్కిన ‘హను-మాన్’ భారీ విజయాన్ని సాధించడంతో దర్శకుడు తన సినిమాటిక్ యూనివర్స్‌ను విస్తరిస్తున్నారు. ఇప్పటికే ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ వంటి చిత్రాలు ప్రకటించారు. అయితే వీటికంటే ముందే ప్రకటించిన ‘అధీర’ పరిస్థితిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను ప్రకటించారు. విడుదలైన తొలి గ్లింప్స్‌కు అప్పట్లో మంచి స్పందన లభించింది.
అయితే ప్రకటన తర్వాత ‘అధీర’కు సంబంధించి పెద్దగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. గత ఏడాది ‘ఓజీ’ విడుదల సమయంలో ఎస్.జే. సూర్యను ప్రతినాయకుడిగా పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత కూడా సినిమా పురోగతిపై స్పష్టత లేదు. మరోవైపు ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. దీంతో ‘అధీర’ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటనే ఆసక్తి నెలకొంది. మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తేనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!