
సినిమాలు

సినీ నటుడు ఆర్యపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. షూటింగ్ సామాగ్రి వినియోగానికి సంబంధించిన రూ.1.80 కోట్ల బకాయిలు చెల్లించలేదని తాహేర్ సినీ టెక్నిక్స్ సంస్థ ఆరోపించింది. ఇటీవల విడుదలైన ఓ సినిమా నిర్మాణ సంస్థలతో పాటు నటుడు ఆర్యపై కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తమ సంస్థ నుంచి షూటింగ్ పరికరాలు తీసుకుని బిల్లులు చెల్లించకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, పరికరాల వినియోగంపై అధికారులు పరిశీలన చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!