

షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కాక్‌టెయిల్ 2’ ప్రమోషన్ కార్యక్రమం పుణెలో గందరగోళానికి దారితీసింది. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించగా, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానులు భద్రతా బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను మధ్యలోనే నిలిపివేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ రద్దీలో షాహిద్ కపూర్ ఇబ్బందులు ఎదుర్కొనగా, కృతి సనన్ రష్మిక మందన్నను సురక్షితంగా తీసుకెళ్లిన దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కృతీ చూపిన స్పందనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హోమీ అదాజానియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2012లో వచ్చిన ‘కాక్‌టెయిల్’కి సీక్వెల్‌గా రూపొందుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!