
సినిమాలు

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతదేశంలో ఈ ఏడాది విడుదలైన అతిపెద్ద హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. టామ్ హోలాండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించి, ప్రీమియర్ షోల తర్వాత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
సినిమా విడుదలైన తర్వాత కూడా టికెట్ బుకింగ్స్‌లో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. ఇటీవల ఒక దశలో గంటకు 67 వేలకుపైగా టికెట్లు బుక్ అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి బుకింగ్ ట్రెండ్ అనేక భారతీయ స్టార్ హీరోల సినిమాలకు కూడా అరుదుగా కనిపిస్తుందని, స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్‌కు ఉన్న అపారమైన అభిమానమే దీనికి కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!