
క్రీడలు

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలకు అభిమానులు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఆగస్టు 9న ఆయన జన్మదినం సందర్భంగా ‘మహేష్ మంత్’ పేరుతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. ఇదే సమయంలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ నుంచి భారీ అప్‌డేట్ వస్తుందనే అంచనాలు మరింత పెరిగాయి.
అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లేదా మరో ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసే అవకాశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజులకు ప్రత్యేక సర్‌ప్రైజ్‌లు అందించిన రాజమౌళి టీమ్, ఈసారి కూడా మహేష్ బాబు అభిమానులకు ప్రత్యేక కానుక ఇస్తుందేమో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!