
జనరల్

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక ప్రతినిధుల బృందంతో కలిసి శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించారు. ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రధాన ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం, పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం అర్చకులు అమ్మవారి ఆలయ మహిమ, చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరించగా, వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు జూలియన్ హిల్‌తో పాటు ప్రతినిధుల బృందానికి అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, దివ్య ప్రసాదాలను బహూకరించి సత్కరించారు. ఈ అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటన సందర్భంగా నగర పోలీసులు ఆలయ పరిసరాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!