

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ధర్మన్’ (ది డెడ్లీ డాక్టర్). ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘ధర్మన్’ చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి పాట విభిన్న జానర్లో ఉండబోతుందని, ముఖ్యంగా రజనీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. అనిరుధ్ ఇప్పటికే ఆ పాటకు ట్యూన్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!