

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ‘రామాయణం’ చిత్రంపై నటి కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మండోదరి పాత్రలో ఆమె కనిపించనున్నారనే వార్తల మధ్య, ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు గర్వకారణమని కాజల్ తెలిపారు. భారతీయ పురాణ గాథను ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం అనేక మంది నిపుణులు కలిసి పని చేస్తున్నారని చెప్పారు.
దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. భారీ సెట్లు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారంతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!