

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వివిధ శాఖల్లో కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం జీవో ఆర్టీ నంబర్ 1553ను విడుదల చేశారు. ఇంధనం, రవాణా, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
కొత్త ఉత్తర్వుల ప్రకారం, జయేశ్ రంజన్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. వికాస్ రాజ్‌ను రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నవీన్ మిట్టల్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చారు. శైలజా రామయ్యర్‌ను రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించగా, రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎ. వాణీ ప్రసాద్‌కు యువజన, పర్యాటక, క్రీడల శాఖలతో పాటు హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ బాధ్యతలు అదనంగా ఇచ్చారు. ఇలంబర్తి కె.ను రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమించారు. సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్‌ఎండీఏకు సంబంధించిన కార్యదర్శి, ప్రత్యేక అధికారి బాధ్యతలు అదనంగా అప్పగించారు. శ్రుతి ఓజాను మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ముషారఫ్ అలీ ఫరూఖీకి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బాధ్యతలు ఇచ్చారు. డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణను మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించగా, జితేష్ వి. పాటిల్‌కు టీజీఆర్‌ఈడీసీఓ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!