
టెక్నాలజీ

హైదరాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో జానీ మాస్టర్‌పై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు తెలిపారు. ఫెడరేషన్‌కు జానీ మాస్టర్ అందజేసిన రూ.3 లక్షలను తిరిగి పంపిస్తున్నామని వెల్లడించారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 24 క్రాఫ్ట్స్‌కు ఫెడరేషన్ పూర్తి మద్దతు కొనసాగుతుందని అధ్యక్షుడు స్పష్టం చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి తీరుపై అభ్యంతరాలను సమావేశంలో సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఫెడరేషన్‌లోని వివిధ విభాగాల మధ్య నెలకొన్న పరిస్థితులపై చర్చించిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!