
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం తొలుత సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర విడుదలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పంపిణీదారులకు విక్రయించిన ప్రదర్శన హక్కుల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్మాణ సంస్థకు విజయ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. వారికి డబ్బులు తిరిగి చెల్లించి, చిత్రాన్ని స్వయంగా విడుదల చేయాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, విజయ్ జన్మదినం ఈ నెల 22వ తేదీన ఉండటంతో, జూన్ 18న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!