

నవీన్ కుమార్ గౌడగా జన్మించిన యశ్.. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుల్లో ఒకరు. టీవీ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన ‘ఉత్తరాయణ’, ‘నంద గోకుల’ వంటి సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం రంగస్థల నటుడిగా ప్రయత్నాలు చేసి, సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2007లో ‘జంబద హుడుగి’తో వెండితెరకు పరిచయమైన యశ్.. ‘గూగ్లీ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ వంటి చిత్రాలతో కన్నడనాట అగ్ర హీరోగా ఎదిగారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ విజయాలతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించారు. దీంతో ‘రాకింగ్ స్టార్’, ‘రాకీ భాయ్’ అనే పేర్లు ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారాయి.
నటనతో పాటు గానం, నిర్మాణ రంగాల్లోనూ యశ్ తన ప్రతిభను చాటుకున్నారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’, ‘మాస్టర్‌పీస్’ చిత్రాల్లో పాటలు పాడారు. టీవీ సీరియల్స్‌లో కలిసి నటించే సమయంలో నటి రాధిక పండిత్‌తో పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఐదేళ్ల ప్రేమ అనంతరం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘యశో మార్గ ఫౌండేషన్’ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ యశ్ భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’లో రావణుడి పాత్రలో కనిపించనుండటంతో ఆయన తదుపరి ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!