
జనరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాపై మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రశంసలు కురిపించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతూ రూ.300 కోట్ల క్లబ్ వైపు వెళ్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. చరణ్ నటన అద్భుతంగా ఉందని, పాత్ర కోసం ఆయన చూపిన అంకితభావం గొప్పదని ఆయన పేర్కొన్నారు.
సినిమా విజయంలో భాగమైన నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు, మైత్రీ మూవీ మేకర్స్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గోపీచంద్ ప్రశంసలతో ‘పెద్ది’పై సోషల్ మీడియాలో మరింత హైప్ పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!