
జనరల్

టాలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చి వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రతి సినిమా పూర్తయ్యాక తన కష్టానికి గుర్తుగా తనకు తానే ఒక ప్రత్యేకమైన బహుమతి కొనుక్కుంటానని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. తన జీవితంలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన బహుమతి రూ.15 లక్షల విలువైన లగ్జరీ వాచ్ అని చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంతో వచ్చిన పారితోషికంతో ఆ వాచ్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!