
జనరల్

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తన తదుపరి భారీ చిత్రం ‘ప్రళయ్’పై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. ‘స్కామ్ 1992’ దర్శకుడు హన్సల్ మెహతా కుమారుడు జై మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ జాంబీ యాక్షన్ థ్రిల్లర్‌ను రణవీర్ తన సొంత నిర్మాణ సంస్థ ‘మా కసం ఫిలిమ్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘డాన్ 3’కు సంబంధించిన చర్చలు తన కొత్త చిత్రంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు రణవీర్ సింగ్ దాదాపు 18 నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!