

బాలీవుడ్ నుంచి వచ్చిన డివోషనల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఊహించని విజయాన్ని అందుకున్నట్లు సమాచారం. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కథనం పేర్కొంది. ఈ విజయంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది.
దీంతో తెలుగు వెర్షన్‌ను విడుదల చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు వచ్చి అనౌన్స్‌మెంట్ చేసినట్లు సమాచారం. అయితే చివరి నిమిషంలో తెలుగు రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి తెలుగు విడుదలపై ఎలాంటి తాజా ప్రకటన రాకపోవడంతో థియేట్రికల్ రిలీజ్ ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కనీసం ఓటీటీలో అయినా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వస్తుందేమోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా, శోబినా సత్య ప్రధాన పాత్రలో నటించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!