

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకువచ్చిన ‘పోస్ట్ ప్రెగ్నెన్సీ రిటర్న్ టు ప్లే’ మార్గదర్శకాలను దీపికా పదుకొణె హర్షిస్తూ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. మహిళా క్రీడాకారిణులకు ఇది గొప్ప గుర్తింపు అని పేర్కొంటూ, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ పాలసీ మహిళలు ప్రసవానంతరం తిరిగి క్రీడల్లోకి రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై దృష్టి సారిస్తోంది.
ప్రసవం అనంతరం మహిళా క్రికెటర్లకు వైద్య, మానసిక సంరక్షణతో పాటు వ్యక్తిగత రికవరీ ప్లాన్‌లు, ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక ట్రైనింగ్ షెడ్యూల్స్ అందిస్తారు. పసిపిల్లలతో ప్రయాణించే తల్లుల కోసం ప్రత్యేక వసతులను కూడా కల్పించారు. ఇదిలా ఉండగా, గతేడాది వర్కింగ్ అవర్స్ కారణంగా పెద్ద ప్రాజెక్టుల నుంచి వైదొలిగిన దీపికకు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్‌తో “కింగ్” సినిమాలో, అలాగే అల్లు అర్జున్ సరసన “రాకా” చిత్రంలో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!