

కన్నడ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా హుమా ఖురేషి ఈ సినిమాపై స్పందిస్తూ యశ్‌తో కలిసి పనిచేసిన తర్వాత ఆయన పట్ల మరింత గౌరవం పెరిగిందని తెలిపారు. సినిమా కోసం ఆయన చూపించిన అంకితభావం, కష్టపడి పనిచేసే తీరు తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇటీవల చూసిన ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల ఫుటేజ్ తనను ఆశ్చర్యపరిచిందని, ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యం ఇచ్చారని, ముఖ్యంగా యశ్ నటన అభిమానులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!