

విడాకుల తర్వాత వ్యక్తిగత జీవితంపై బాలీవుడ్ నటి ఈషా డియోల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. జీవితంలో ప్రేమ, అనుబంధం లేని లోటు ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తోందని ఆమె చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఒక సంబంధం ముగిసిందని ప్రేమపై నమ్మకం కోల్పోలేదని, సరైన వ్యక్తి జీవితంలోకి వస్తే మరోసారి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగానే ఉన్నానని ఆమె వెల్లడించారు. వ్యక్తిగత జీవితంపై ఇంత స్పష్టంగా స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చకు కారణమైంది.
భరత్ తఖ్తానీతో 12 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన తర్వాత ఈషా తన ఇద్దరు కుమార్తెల పెంపకానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబమే తనకు ప్రధాన బలం అని చెప్పిన ఆమె, తల్లిదండ్రులు హేమమాలిని, ధర్మేంద్ర మధ్య ఉన్న బంధం ఇప్పటికీ తనకు ఆదర్శమని పేర్కొన్నారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలు తన ఆలోచనలను మార్చినా ప్రేమపై విశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయలేదని చెప్పారు. మరోవైపు మాజీ భర్త భరత్ తఖ్తానీ కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఈషా వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!