

‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో వస్తున్న అవమానకర వ్యాఖ్యలు, ట్రోల్స్‌ను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని అవమానించేలా జరుగుతున్న ప్రచారం కేవలం ఒక సినిమా టైటిల్‌పై విమర్శ కాదని, అది తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా భావిస్తున్నట్లు అసోసియేషన్ పేర్కొంది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛకు గౌరవం ఉన్నప్పటికీ, ప్రాంతీయ భాషలను కించపరిచే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది.
ఈ అంశంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెంటనే స్పందించి తెలంగాణ భాష గౌరవాన్ని కాపాడేలా ప్రకటన విడుదల చేయాలని అసోసియేషన్ కోరింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ జనసేన నాయకత్వం కూడా ఈ విషయంపై స్పందించాలని విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తెలంగాణ సమాజం తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!