

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మరోవైపు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మాలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం కూడా అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఒకవేళ బాలకృష్ణ సినిమా కూడా అదే నెలలో విడుదలైతే, ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే బాలకృష్ణ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో అక్టోబర్‌లో నిజంగానే ఈ రెండు చిత్రాలు పోటీ పడతాయా అనే అంశం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!