

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ స్థానాన్ని ఎవరూ ఎక్కువ కాలం కొనసాగించలేరనే భావనను చిరంజీవి 30 ఏళ్లుగా తిప్పికొట్టారని అన్నారు. బాలీవుడ్‌కే భారీ వసూళ్లు సాధ్యమనే అపోహలను తొలగించి తెలుగు సినిమాలకు కూడా భారీ కలెక్షన్లు సాధ్యమని నిరూపించారని ప్రశంసించారు.
హీరోయిజం, డ్యాన్స్, సేవా కార్యక్రమాలు, కుటుంబ వారసత్వం వంటి అంశాల్లోనూ చిరంజీవి ప్రత్యేక ముద్ర వేశారని హైపర్ ఆది పేర్కొన్నారు. డ్యాన్స్ అంటే కేవలం హీరోయిన్ చుట్టూ తిరగడం కాదని, దానికి ప్రత్యేకమైన స్థాయిని చూపించారని అన్నారు. హీరోలు సంపాదనకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేయగలరని తన సేవా కార్యక్రమాల ద్వారా నిరూపించారని కొనియాడారు. అలాగే తండ్రి స్టార్ అయితే కుమారుడు అదే స్థాయికి చేరుకోలేడనే అపోహను కూడా చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్ విజయాలతో చెదరగొట్టారని అన్నారు. ప్రతికూల ఆలోచనలు, అపోహలను అధిగమిస్తూ చిరంజీవి అగ్రస్థానంలో నిలిచారని హైపర్ ఆది ప్రశంసించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!