

బుల్లితెర స్టార్ యాంకర్, నటి శ్రీముఖి ‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషించగా, శ్రీముఖి కీలక పాత్రలో కనిపించనున్నారు. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన శ్రీముఖి, దర్శకురాలు నందినీ రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. సమంతను ప్రస్తుత తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా అభివర్ణించారు. అనంతరం తన పెళ్లి గురించి మాట్లాడిన ఆమె, “అన్నీ రెడీగా ఉన్నాయి.. సరైన పెళ్లి కొడుకు దొరికితే పెళ్లి జరిగిపోతుంది” అని సరదాగా చెప్పారు. దీనిపై యాంకర్ సుమ స్పందించగా, “నేను కూడా ఆయన కోసమే వెయిటింగ్” అని శ్రీముఖి చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!