

హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో శర్వానంద్ జూనియర్ సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర చుట్టూ సాగే డ్రామా ఆసక్తికరంగా ఉండటంతో పాటు సినిమాలోని పలు ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని సమాచారం. ఈ పాత్ర కోసం శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది.
హీరోయిన్ విషయంలో ఇప్పటికే పలు వార్తలు ప్రచారంలోకి రాగా, భాగ్యశ్రీ బోర్సేను కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. కొత్త షెడ్యూల్‌లో శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సేపై లవ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీను వైట్ల మరోసారి టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!