

బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ జోరు కొనసాగుతోంది. విడుదలైన ఆరో వారంలోనూ ఈ సినిమా బలమైన వసూళ్లు సాధిస్తూ తెలుగు వెర్షన్ చిత్రాల ఆరో వారం నెట్ కలెక్షన్లలో కొత్త రికార్డు నెలకొల్పినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆరో వారంలో రూ.3.46 కోట్ల నెట్ వసూళ్లతో ‘ఇరుముడి’ అగ్రస్థానంలో నిలిచిందని సమాచారం. ఇప్పటివరకు ‘బాహుబలి 2’ రూ.2.65 కోట్లతో ఈ జాబితాలో ముందుండగా.. ‘ఇరుముడి’ ఆ మార్క్‌ను అధిగమించింది.
ఆరో వారంలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన తెలుగు వెర్షన్ చిత్రాల జాబితాలో ‘ఇరుముడి’ తర్వాత ‘బాహుబలి 2’ రూ.2.65 కోట్లు, ‘మన శంకర వరప్రసాద్’ రూ.2.04 కోట్లు, ‘కల్కి 2898 ఏడీ’ రూ.2.00 కోట్లు, ‘మహావతార్ నరసింహ’ రూ.1.93 కోట్లు, ‘పుష్ప 2’ రూ.1.61 కోట్లతో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రానికి రవితేజ హీరోగా నటించగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!