

బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ మరియు టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కాంబినేషన్‌లో ఓ అన్‌టైటిల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని ప్రేమించడం, అతని కోసం పోటీ పడటం అనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఉమేష్ బిస్ట్ దర్శకత్వం వహిస్తుండగా, ఏక్తా కపూర్ మరియు గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలకు జాన్వీ కపూర్, శ్రీలీల ఇప్పటికే ఎంపిక కాగా, హీరో పాత్ర కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోందని తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇద్దరు టాప్ హీరోయిన్లు ఒకే హీరో కోసం పోటీ పడే కాన్సెప్ట్ కారణంగా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!