

బిగ్‌బాస్ హౌస్‌లో త్రిగుణ్ ఉండటంతో ఆయన వ్యక్తిగత జీవితం, సినిమాలు, ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలపై చర్చ జరుగుతోంది. త్రిగుణ్ 2023 సెప్టెంబర్ 2న నివేదితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా అవినాశి పట్టణంలోని శ్రీ సెంథూర్ మహల్‌లో కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. అయితే అప్పట్లో వీరి పెళ్లిపై పలు రూమర్లు వచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోల్లో త్రిగుణ్ తన వివాహం సీక్రెట్‌గా జరగలేదని, తల్లి మరణించడంతో ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తన భార్యను కూడా తన తల్లే పరిచయం చేశారని చెప్పారు. నివేదిత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న సమయంలో ఇంటి నిర్మాణం విషయంలో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారితీసిందని వివరించారు.
ఇక తన సినీ ప్రయాణం గురించి కూడా త్రిగుణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 17–18 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని, కెరీర్‌లో మార్పు కోసం తన పేరును అదిత్ అరుణ్ నుంచి త్రిగుణ్‌గా మార్చుకున్నానని చెప్పారు. పేరు మార్చుకున్న తర్వాత దాదాపు పది సినిమాల్లో నటించానని తెలిపారు. చెన్నైకి చెందిన త్రిగుణ్ 2009లో ‘కథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా, సెకండ్ హీరోగా, సహాయ పాత్రల్లో కనిపించారు. ‘24 కిస్సెస్’, ‘పీఎస్‌వీ గరుడ’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘కథ కంచికి మనం ఇంటికి’, ‘డియర్ మేఘ’, ‘ఈషా’ వంటి సినిమాల్లో నటించారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొండా’లో టైటిల్ రోల్ పోషించారు. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’లో సెకండ్ హీరోగా కనిపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!