

తమిళ అగ్రకథానాయకుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ‘సిగ్మా’తో దర్శకుడిగా పరిచయం కానున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు తన తండ్రి విజయ్ నటించిన ‘పోకిరి’, ‘సచిన్’ చిత్రాల్లో దేనికి సీక్వెల్ తీస్తారని ప్రశ్న ఎదురైంది. అయితే ఈ రెండు సినిమాలను కాకుండా ‘బద్రి’కి సీక్వెల్ తీస్తానని జాసన్ తెలిపారు. ఆ సినిమాలో హీరో పాత్రకు ఉన్న ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం తనకు నచ్చుతుందని చెప్పారు.
చిన్నతనంలో తండ్రితో కలిసి ఎన్నో సినిమాలు చూసిన జ్ఞాపకాలను జాసన్ సంజయ్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ‘పోకిరి’ రోజులు తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని తెలిపారు. విజయ్, అజిత్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు ఎంతో సందడిగా ఉండేవని చెప్పారు. విజయ్ నటించిన ‘బద్రి’ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’కు తమిళ రీమేక్. ఈ చిత్రం తమిళంలోనూ విజయవంతమైంది. జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘సిగ్మా’ అక్టోబర్ 2న విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!