

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులను సెప్టెంబర్లో ప్రారంభించి, జనవరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఏప్రిల్ 7, 2027 విడుదల తేదీకి అనుగుణంగా సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు ₹1,300 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో మహేష్ బాబు రుద్ర, శ్రీరాముడి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ప్రియాంక మందాకినిగా కనిపించనుండగా, కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, దేవా కట్టా సంభాషణలు రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా మంచి స్పందనను అందుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!