

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర డివోషనల్ జానర్ సినిమాలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం అయ్యప్ప స్వామి నేపథ్యంతో ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. రవితేజ కెరీర్‌లోనూ ఈ సినిమా ఓ ప్రత్యేకమైన ఎమోషనల్ విజయంగా నిలిచిందనే చర్చ జరిగింది. ఇదే సమయంలో బాలీవుడ్‌లో దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ‘హనుమాన్ అంశ్’ కూడా ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్నట్లు సమాచారం.
ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పోలిక ఇప్పుడు చర్చకు వస్తోంది. తెలంగాణలోని ఓ ప్రాంతంలో ‘ఇరుముడి’ షోను మరో సినిమాతో రీప్లేస్ చేయడంతో ప్రేక్షకులు థియేటర్ వద్ద ఆందోళన చేసి మళ్లీ ‘ఇరుముడి’ ప్రదర్శించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో ముంబైలోని బాంద్రాలో ‘హనుమాన్ అంశ్’ స్థానంలో ‘మిర్జాపూర్’ను ప్రదర్శించడంతో ప్రేక్షకులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో థియేటర్ యాజమాన్యం మళ్లీ ‘హనుమాన్ అంశ్’ షోను వేసినట్లు సమాచారం. కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయితే వారి నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందో ఈ ఘటనలు చూపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!