
రాజకీయాలు

ప్రఖ్యాత సంగీత దర్శకుడు కోటి, శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం అన్నమయ్య కీర్తనలు స్వరపరిచే అవకాశాన్ని కల్పించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కీర్తనలను త్వరలోనే భక్తుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆదివారం కోటి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో వీఐపీ ప్రారంభ విరామ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!