
సినిమాలు

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకుల సమయంలో ప్రచారంలోకి వచ్చిన రూ.400 కోట్ల భరణం వార్తలపై తాజాగా స్పష్టత వచ్చింది. ఎన్నేళ్లుగా వైరల్ అవుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని సుసానే ఖాన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ పుకార్లకు తెరపడినట్టైంది.
సుసానే సోదరి ఫరా ఖాన్ అలీ మాట్లాడుతూ, సుసానే ఎలాంటి భరణం తీసుకోలేదని స్పష్టం చేశారు. డబ్బు కంటే పరస్పర గౌరవం, కుటుంబ బంధాలకే తమ కుటుంబం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. విడాకుల తర్వాత కూడా హృతిక్, సుసానే స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ, పిల్లల భవిష్యత్తు కోసం కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. ఈ వివరణ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!