

బాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ‘లగాన్’ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఆమిర్ ఖాన్, గ్రేసీ సింగ్, రెచల్ షెల్లీ, పాల్ బ్లాక్థోర్న్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామాను అశుతోష్ గోవారీకర్ తెరకెక్కించారు. 2001 జూన్ 15న విడుదలైన ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ సందర్భంగా ముంబైలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. చిత్రంలోని విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు పాల్ బ్లాక్థోర్న్ ప్రత్యేకంగా లండన్ నుంచి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘లగాన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఎనిమిది జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన మూడో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. బ్రిటిష్ పాలనలో పన్ను మాఫీ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడిన చంపానేర్ గ్రామస్తుల కథను ఆవిష్కరించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!