

జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల సమీపంలో నివసించే ప్రజలకు ఊరట కల్పించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రాయితీ వార్షిక లోకల్ పాస్‌ను ప్రవేశపెట్టింది. నవంబర్ 1, 2026 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన నాన్ కమర్షియల్ వాహన యజమానులు ఈ పాస్ పొందవచ్చు. మున్సిపల్ లేదా పట్టణ పరిధికి వెలుపల ఉన్న టోల్‌ప్లాజాలకు ఏడాదికి రూ.1,500, ఆ పరిధిలో ఉన్న టోల్‌ప్లాజాలకు రూ.3,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాస్ పొందాలంటే వాహనానికి చెల్లుబాటు అయ్యే, పనిచేస్తున్న ఫాస్టాగ్ ఉండాలి.
ఈ వార్షిక పాస్ ఏ టోల్‌ప్లాజాకు తీసుకుంటారో అక్కడ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇతర టోల్‌ప్లాజాల వద్ద దీనిని ఉపయోగించడానికి లేదా మరొకరికి బదిలీ చేయడానికి వీలుండదు. క్లోజ్డ్ టోల్ కలెక్షన్ విధానం అమల్లో ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ రాయితీ వర్తించదు. అలాగే ప్రత్యామ్నాయ రహదారి లేదా సర్వీస్ రోడ్డు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పాస్ ఇవ్వరు. నవంబర్ 1 నుంచి అర్హులైన వారు సంబంధిత టోల్‌ప్లాజాల వద్ద ఈ పాస్ పొందవచ్చు. డిసెంబర్ 1 నుంచి రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా కూడా అందుబాటులోకి రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!