30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సామూహిక సమాధుల తవ్వకంపై అమెరికా సైనికులకు శిక్షణ..

Writer: Chandrika 02:14 PM, 30 అక్టోబర్, 2026
సామూహిక సమాధుల తవ్వకంపై అమెరికా సైనికులకు శిక్షణ..

యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు మరణించే పరిస్థితులు ఎదురైతే ఎలా వ్యవహరించాలనే అంశంపై అమెరికా సైన్యం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సామూహిక తాత్కాలిక సమాధుల (Mass Graves) ఏర్పాటు, మృతదేహాల గుర్తింపు, వాటిని భద్రపరచడం, యుద్ధం ముగిసిన తర్వాత స్వదేశానికి తరలించడం వంటి అంశాలపై సైనికులకు శిక్షణ ఇస్తోంది. నార్త్‌ కరోలినాలో నిర్వహించిన ‘ఆపరేషన్‌ డ్రాగన్‌ కోవెనెంట్‌’ రెండో దశలో బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలతో తాత్కాలిక ఖనన స్థలాలను తవ్వి పూడ్చే ప్రక్రియను పరీక్షించారు. కొరియా యుద్ధం (1950–53) తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఇటువంటి ప్రక్రియలను పరీక్షించడం ఇదే తొలిసారని అమెరికా సైన్యం వెల్లడించింది. ఆ యుద్ధంలో 36,515 మంది అమెరికా సైనికులు మరణించగా, మరో 7,245 మంది పట్టుబడ్డారు.

అమెరికా సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక తాత్కాలిక ఖనన స్థలంలో ఐదు సమాంతర గోతులు ఏర్పాటు చేసి సుమారు 100 మృతదేహాలను భద్రపరిచేలా ప్రణాళిక రూపొందించారు. తాజా శిక్షణలో ఉపయోగించిన భారీ యంత్రాలతో నిరంతరంగా పనిచేస్తే 24 గంటల్లో 2,400 మృతదేహాలకు సరిపడా ఖనన ఏర్పాట్లు చేయవచ్చని అంచనా వేశారు. మరోవైపు ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ, పశ్చిమాసియాలో అమెరికా సైనికుల మరణాల నేపథ్యంలో ఈ శిక్షణపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అక్టోబర్‌ 29 నాటికి ఇరాన్‌ యుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో మరణించిన అమెరికా సైనికుల అధికారిక సంఖ్య 23కు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ శిక్షణను ఇరాన్‌పై దాడులకు సంబంధించిన ముందస్తు ఏర్పాటుగా అమెరికా సైన్యం ప్రకటించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దు

ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దు

రెండో రోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన..

రెండో రోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన..

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు గుడ్‌న్యూస్..

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు గుడ్‌న్యూస్..

కోర్టు విచారణ వీడియోల అక్రమ అప్‌లోడింగ్‌పై చర్యలు తీసుకోండి.. MeitYకి సుప్రీంకోర్టు ఆదేశం

కోర్టు విచారణ వీడియోల అక్రమ అప్‌లోడింగ్‌పై చర్యలు తీసుకోండి.. MeitYకి సుప్రీంకోర్టు ఆదేశం

భారత నౌకాదళానికి  అత్యాధునిక యుద్ధనౌకలు..

భారత నౌకాదళానికి అత్యాధునిక యుద్ధనౌకలు..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

ట్యాగ్లు
అమెరికా సైన్యంసామూహిక సమాధులుమాస్ గ్రేవ్స్ఇరాన్ యుద్ధంఅమెరికా సైనికులుఆపరేషన్ డ్రాగన్ కోవెనెంట్పశ్చిమాసియా ఉద్రిక్తతలుడొనాల్డ్ ట్రంప్యుద్ధ సన్నాహాలుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రగడ.. రాహుల్‌కు నిర్మలమ్మ కౌంటర్
బిజినెస్

ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రగడ.. రాహుల్‌కు నిర్మలమ్మ కౌంటర్

కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!
సినిమాలు

కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!
రాజకీయాలు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

టెక్సాస్‌లో రాజకీయ వేడి..దక్షిణాసియా ఓటర్ల నిర్ణయం ఎటువైపు?
జనరల్

టెక్సాస్‌లో రాజకీయ వేడి..దక్షిణాసియా ఓటర్ల నిర్ణయం ఎటువైపు?

నాలుగో టీ20లో  భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!
క్రీడలు

నాలుగో టీ20లో భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

చివరి వ్యక్తికి సాయం అందే వరకు విశ్రమించేది లేదు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

చివరి వ్యక్తికి సాయం అందే వరకు విశ్రమించేది లేదు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

ఛలో ఢిల్లీ.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర ప్రారంభం
రాజకీయాలు

ఛలో ఢిల్లీ.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర ప్రారంభం

తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీని పంచుకున్న సమంత.. వర్కవుట్స్ వీడియో వైరల్‌
సినిమాలు

తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీని పంచుకున్న సమంత.. వర్కవుట్స్ వీడియో వైరల్‌

‘మీర్జాపూర్’తో ఓటీటీలో ఊహించని ట్విస్ట్
ఓటీటీ

‘మీర్జాపూర్’తో ఓటీటీలో ఊహించని ట్విస్ట్

కాంగ్రెస్‌ మెగా ర్యాలీని వాయిదా వేయాలని సోనియా గాంధీకి దిల్లీ వ్యాపారుల లేఖ
జనరల్

కాంగ్రెస్‌ మెగా ర్యాలీని వాయిదా వేయాలని సోనియా గాంధీకి దిల్లీ వ్యాపారుల లేఖ

రాహుల్ గాంధీ ఉంటే మోదీకి చాలు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఉంటే మోదీకి చాలు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘డ్రాగన్‌’ అణుబాంబులా ఉంటుంది: రాజీవ్‌ కనకాల
సినిమాలు

‘డ్రాగన్‌’ అణుబాంబులా ఉంటుంది: రాజీవ్‌ కనకాల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!