

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటన కొనసాగించారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరుకు చేరుకున్న ఆయన మొగల్తూరు, నరసాపురం మండలాల్లో పర్యటించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నరసాపురం మండలం కొత్తనవరసపురంలో నీట మునిగిన వ్యవసాయ పొలాలను ముఖ్యమంత్రి సందర్శించారు. పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పంట నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందం కూడా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుందని చంద్రబాబు రైతులకు వివరించారు. కేంద్ర బృందం పరిశీలన, నష్టాల అంచనా పూర్తయిన తర్వాత బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించే దిశగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!