

అక్కినేని అఖిల్ నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకెళ్తోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. చాలా కాలం తర్వాత అఖిల్‌కు ఈ సినిమా రూపంలో సాలిడ్ హిట్ దక్కిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కథలోని గ్రామీణ నేపథ్యం, నటీనటుల ప్రదర్శనతో పాటు అందుబాటులో ఉన్న టికెట్ ధరలు కూడా ఈ విజయానికి ప్రధాన కారణాలుగా మారాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరి రావు, సునీల్, రామ్కీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!