

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథాలజికల్ ఎపిక్ 'మహాకాళి' 125 రోజుల విజయవంతమైన చిత్రీకరణను పూర్తి చేసుకుని చివరి షెడ్యూల్‌లోకి ప్రవేశించింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన దృశ్యానుభూతిని అందించనుంది.
ఇక చిత్రీకరణలో మరో కీలక మైలురాయిగా రోహిత్ సరాఫ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. అంతకుముందే శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఖన్నా తన భాగం చిత్రీకరణను ముగించారు. భూమి శెట్టి మహాకాళి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విశేష స్పందనను అందుకున్నాయి. ప్రస్తుతం చివరి షెడ్యూల్ వేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి విడుదల తేదీ, ప్రచార కార్యక్రమాలపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!