
జనరల్

ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తాజా బ్లాగ్‌లో అర్థరాత్రి, తెల్లవారుజామున జరిగే మ్యాచ్‌ల కారణంగా నిద్ర, రోజువారీ పనులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మ్యాచ్‌ల ఉత్కంఠ, తమకు ఇష్టమైన జట్లకు మద్దతు ఇవ్వడం, విజయాలు-పరాజయాలను ఆస్వాదించడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని తెలిపారు.
ముఖ్యంగా అండర్‌డాగ్ జట్లు అద్భుత ప్రదర్శనతో దిగ్గజ జట్లకు గట్టి పోటీ ఇవ్వడం తనను ఆకట్టుకుందని అమితాబ్ అన్నారు. క్లబ్‌ల కోసం పోటీ పడే ఆటగాళ్లు దేశం కోసం ఒక్కటిగా ఆడటం గొప్ప స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. కేవలం 17, 18 ఏళ్ల వయసులోనే కోట్లాది మంది ఆశలను మోస్తున్న యువ ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ, నేటి యువత సాధిస్తున్న విజయాలు భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!