
రాజకీయాలు

సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ వేడుకకు అనిల్ రావిపూడి, సుప్రియ యార్లగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
టీజర్‌లోని విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక శాపం, వరుస మరణాల మిస్టరీ చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో సుమంత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!