
జనరల్

టైఫాయిడ్‌తో చికిత్స పొందుతున్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, నీట్ ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తున్న విద్యార్థులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన స్పందిస్తూ, ఉద్యమంలో పాల్గొంటున్న వారి పట్టుదలను ప్రశంసించారు. ఐక్యంగా, క్రమశిక్షణతో పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఉద్యమం ఇదే స్థాయిలో కొనసాగితే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై తప్పకుండా స్పందించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యం కుదుటపడిన వెంటనే తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానని హామీ ఇస్తూ, శాంతియుతంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!