

యంగ్ హీరో మౌళి తనుజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’ (DNK) ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రాబరీ, కామెడీ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ‘లిటిల్ హార్ట్స్’ విజయం తర్వాత మౌళి నటిస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

శ్రీను కాంబాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుస్మితా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. అలీ, రజిత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న ఈ ట్రైలర్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!